నా ఈ మొదటి శీర్షిక ను తెలుగు లో రాస్తున్నందుకు చాల గర్వం గా ఉంది.ఎందుకో ఆర్థం కాదు చాల మంది మన వారు లేని బడాయికి పోతుంటారు. నాకు అది నచ్చదు. తెలుగు వాడిగా పుట్టినందుకు మన కన్న తెలుగు కి కొంత గౌరవం ఇద్దాం..పిల్ల జమిందార్ సినిమా లో సంబాషణ నా మనసుకు హత్తుకుంది." పక్క రాష్ట్రాల వాళ్ళు భాష భాష అని చస్తుంటే మనం తెలుగు చచ్చి పోవాలని చూస్తున్నాం " అని..నిజమే తమిళనాడు లో వారికి ఇంగ్లీష్ వచ్చినా తమిళ్ లో నే మాట్లాడతారు.విదేసియులతో సైతం అలానే మాట్లాడతారు. అక్కడ హోర్డింగ్స్, నేమ్ బోఅర్డ్స్ అన్ని తమిళ్ లో నే ఉంటాయి..మనం మన భాష ని ప్రేమిద్దాం.
సినిమా హీరోయిన్స్ ని చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ఎందుకు అంటే వారికీ తెలుగు రాకపోయినా ఆడియో విడుదల అప్పుడు , ఇంకా రక రకాల సమయాలలో తెలుగు మాట్లాడటానికి ట్రై చేస్తారు. మనం వాళ్ళ నుంచయిన నేర్చుకుందాం.తెలుగు లో నే మాట్లాడుదాం,తెలుగే రాద్దాం, మం,డాడ్ అనే హృదయం లేని మాటలు కన్నా అమ్మ నాన్న అనే మనసుకు దగ్గరయిన పదాలు పలుకుదాం...